హైదరాబాద్ లో ఆరు రోజుల క్రితం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెం లేని తలను పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ మృతదేహాం.. కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్‌లో కొద్దిరోజుల క్రితం మొండెం లేని తల లభ్యమైన వ్యవహారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నర్సు ఎర్రం అనూరాధగా పోలీసులు గుర్తించారు.