Maharashtra: కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. విమానం ప్రమాదానికి గురైతే ప్రాణాలతో బయటపడే అవకాశం చాల తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా చిన్న సమస్య తలెత్తుతుంది అని అనుమానం వచ్చిన పైలెట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో ఓ విమానం తిరగబడింది. వివరాలలోకి వెళ్తే.. రెడ్ బర్డ్ అకాడమీకి చెందిన టెక్నామ్ ఎయిర్‌క్రాఫ్ట్ VT-రాబిట్ శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని గుర్తించిన ట్రెయినర్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు.
Read also:Egypt’s aid for Gaza: ఈజిప్టు సహాయం సముద్రంలో నీటిచుక్క లాంటిది.. గాజా
అయితే అనుకున్నట్టుగానే విమానం ల్యాండ్ అయ్యింది. కానీ ల్యాండ్ అయినా తరువాత రన్వే పైన విమానం వేగం అదుపుకాలేదు. ఈ నేపథ్యంలో ట్రెయినర్ వేగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రయత్నం ఫలించలేదు. విమానం వేగం అదుపుకు కాకపోవడం వల్ల ఆ విమానం బోల్తాకొట్టింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదం నుండి ట్రెయినర్, ట్రెయినీ ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని, దర్యాప్తు పూర్తయిన తరవాత ఘటనకు కచ్చితమైన కారణం ఏమిటో తెలుస్తుందని అధికారులు తెలిపారు.
#WATCH | Maharashtra: Red Bird Academy Tecnam aircraft VT-RBT made an emergency landing near Baramati airfield. The instructor and trainee both are safe. Further investigation underway: DGCA ( Directorate General of Civil Aviation) https://t.co/yJ8AWToTUw pic.twitter.com/7Ajapflbra
— ANI (@ANI) October 22, 2023