PM Modi: 2023లో మణిపూర్‌లో కుకీలు, మైయితీలకు మధ్య జాతి ఘర్షణలు ప్రారంభయ్యాయి. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఘర్షణలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది.
Manipur: మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మరోసారి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణలతో భద్రతా బలగాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి.
Manipur Violence: మణిపూర్లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది.
మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
Manipur : మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, రాకెట్‌ల వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం, మణిపూర్ పోలీసుల సంయుక్త బృందం ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
Manipur: జాతి సంఘర్షణ కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు.
Manipur Violence: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేయగా.. ఆ వ్యక్తి మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని తేలింది.