ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి.