Chamala Kiran Kumar Reddy: ఎంపీ నిధులతో కొమురవెళ్లి మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తా
- చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సీఎంతో చర్చిస్తానని హామీ
- కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎంపీ
- గతంలో తెలంగాణకి కేంద్రం నిధుల మంజూరులో అలసత్వం ప్రదర్శించిందని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ నిధులతో కొమురవెళ్లి మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఏర్పాటు అయ్యేలా చూస్తానన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..పట్నాలు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణకి కేంద్రం నిధుల మంజూరులో అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించారు. ఈ సారి తెలంగాణకి నిధులు మంజూరులో ఎంపీలు పోరాడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ,గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. హరీష్ రావు జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు వచ్చే నీటిని తపాస్ పల్లి రిజర్వాయర్ తో సిద్దిపేటకు తీసుకెళ్లి చేర్యాల రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రంగనాయక సాగర్ నుంచి నకిరేకల్, తుంగతుర్తి బ్రహ్మాణ బంజర్ పల్లి ,వెళ్ళాంల కాలువలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు.
READ MORE: Fire In Goods Train : ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు.. పలు రైళ్లకు అంతరాయం..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 8 స్థానాలును కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ ఈసారి అదనంగా మరో 5 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే భువనగిరిలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ 2,56,187 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తాజాగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?