గల్ఫ్ దేశంలో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ప్రారంభించనుంది. అక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు అబుదాబి విద్యా మరియు నాలెడ్జ్ శాఖ (ADEK) ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు.