ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే మహానగరంలో ఈవీల సంఖ్య కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు సినీ హీరోలు కూడా ఈవీల బాటే పడుతున్నారు. ఈ పరిణామాలతో మార్కెట్లో ఈవీ వాహన కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని షోరూం నిర్వాహకులు తెలిపారు.
Also Read : Mumbai: ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రముఖ హీరోయిన్ అరెస్ట్
అయితే మొన్న మెగాస్టార్ చిరంజీవి 1.9 కోట్లు పెట్టి టొయోటా వెల్ ఫైర్ ( ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ ) కారు కొనుగోలు చేయగా.. నిన్న హీరో రవితేజ రూ. 34.49 లక్షలతో బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారును తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో హీరో అల్లరి నరేశ్ రూ. 64.9 లక్షలతో కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు. ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. కాగా అతడి కారుకు టీఎస్ 09జీబీ 2799 నంబర్ ను కేటాయించారు. ఇలా నగరంలో ఈవీల కొనుగోలు జోరందుకుంది.
Also Read : Covid Cases : కరోనా డేంజర్ బెల్స్.. 12 వేలు దాటిన కేసులు
ఈ వాహనాల్లో సదరు కంపెనీలు పోటాపోటీగా మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో వెహికిల్స్ ను తీర్చిదిద్దుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న టొయోటా నుంచి విడుదలైన ఈ వెల్ ఫైర్ లో అద్భుతమైన, అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్లతో పాటు భద్రతపరమైన అంశాలు బోలెడు ఉన్నాయి. హైస్పెసిఫికేషన్స్ తో విడుదలైన ఈ మల్టీపర్సప్ వెహికిల్ లో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చెయొచ్చు. ట్విన్ సన్ రూఫ్, త్రీజోన్ క్లైమేట్ కంట్రోల్, 13 అంగుళాల ఎంటర్ టైన్మెంట్ స్ర్కిన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. దీనికి 2.5 పెట్రోల్ ఇంజిన్ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటర్లు కూడా ఉన్నాయి.
Also Read : Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి..? ఏమిటా కథ..
ఇక కియా నుంచి వచ్చిన ఈవీ 6జీటీ లైన్ ఏడబ్య్లూడీ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ కు 708 కిలో మీటర్ల దూరం ప్రయాణించొచ్చు. కేవలం 18 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ సిద్ధమవుతుంది. ఇది ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్. 77.4 కిలో వాట్స్ బ్యాటరీ. సీటింగ్ కెపాసిటీ 5. ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ ఇలా ఇన్నో ప్రత్యేకలు ఉన్నాయి. అలాగే ఇటీవల రవితేజ తీసుకున్న బీవైడీ ఏటీటీఓ 3ఈవీ కార్ ఫుల్ ఛార్జింగ్ తో 521 కిలో మీటర్లు దూరం ప్రయాణించొచ్చు. ద్విచక్ర వాహనాలు కూడా ఇలాంటి అనేక ఫీచర్లతో ఆదరణ పొందుతున్నాయి.