ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతుంది. హీరో రవితేజ రూ. 34.49 లక్షలతో బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారును తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో హీరో అల్లరి నరేశ్ రూ. 64.9 లక్షలతో కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు.