కర్ణాటకలో బీజేపీ సర్కార్ ను 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ విర్శించింది. ఇప్పుడు కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్‌ను కూడా 80 శాతం కమీషన్ పాలనగా అభివర్ణిస్తున్నారు. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత పాలక వామపక్షాలు, కేరళ ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని పెంచిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల విమర్శించారు. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.
Also Read : Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా
కర్ణాటకలో 40 శాతం కమీషన్ తీసుకుంటే.. ఇక్కడ (కేరళలో) 80 శాతం కమీషన్ తీసుకుంటున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరా స్కామ్‌కు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నితలా ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంపై స్పందిస్తూ రెండ్రోజుల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం అక్కడ పాలక ప్రభుత్వం తీసుకుంటున్న 40 శాతం కమీషన్‌ను హైలైట్ చేసిందని సతీశన్ అన్నారు.
Also Read : Kauri Darden Richins: భర్తని చంపింది.. అతనిపై పుస్తకం రాసింది.. చివరికి అలా దొరికింది
కేరళలో 46- 65 శాతం కమిషన్ ను వామపక్షాల ప్రభుత్వం తీసుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సేఫ్ కేరళ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ట్రాక్ చేయడానికి మోటారు వాహన శాఖ 726 AI- ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సేఫ్ కేరళ ప్రాజెక్టును ఏప్రిల్‌లో ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది.
Also Read : Karnataka CM : హస్తినకు చేరిన కర్ణాటక సీఎం పంచాయితీ
సేఫ్ కేరళ ప్రాజెక్ట్ ముసుగులో అధికారంలో ఉన్న వారి బంధువుల జేబులు నింపడానికి వామపక్ష ప్రభుత్వం ప్రజలను దోచుకోవడాన్ని పార్టీ అనుమతించదని రమేష్ చెన్నితాల అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ బంధువు ఒకరు ఏఐ కెమెరాల ఏర్పాటు పనులు చేపట్టిన ఓ ప్రైవేట్ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలున్నాయి. పర్యవసానంగా భారీ ప్రజాందోళనకు భయపడి ప్రాజెక్ట్ కింద జరిమానా విధించడాన్ని ఇంకా అమలు చేయలేదని రమేష్ చెన్నితాల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సమస్యలపై ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు రమేష్ చెన్నితాల తెలిపారు.