Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా మేనల్లుడు, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘PVT 04’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మంచు మనోజ్ తో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని అనౌన్స్ చేసిన శ్రీకాంత్ రెడ్డి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇటివలే బ్యాక్ టు బ్యాక్ ఆర్టిస్టుల పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చిన మేకర్స్, లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ గ్లిమ్ప్స్ ని లాంచ్ చేశారు. ‘PVT 04’కి ఆదికేశవ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్, గ్లిమ్ప్స్ ని మాస్ గా కట్ చేశారు. టెంప్లేట్ కమర్షియల్ సినిమాని గుర్తు చేసేలా… “ఒక గుడిని కూల్చడానికి కొంతమంది మనుషులు వెళ్లడం, పూజారి ఆపడానికి ప్రయత్నించడం, ఆ రౌడీలని హీరో కొట్టడం, ఈ విషయం విలన్ వరకూ వెళ్లి… తన మనుషులని కొట్టింది ఎవరు అని అడగంతో హీరో ఇంట్రడక్షన్…” ఇదే ఫార్మాట్ లో ఆదికేశవ గ్లిమ్ప్స్ కి కట్ చేశారు. వైష్ణవ్ తేజ్ ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఫిట్ గా కనిపిస్తున్నాడు. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి మరి వాటికి ‘ఆదికేశవ’ సినిమాకి మధ్య డిఫరెన్స్ ని ఎలా చూపిస్తారు అనేది చూడాలి.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
Meet the Fiercest #PanjaVaisshnavTej in a new action avatar! 🔥👊🏻
Here's the First Glimpse of #Aadikeshava 💥⚡
▶️ https://t.co/qAkurwAtlpJuly 2023 Release, In Theaters worldwide. 🤩@sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj…
— Sithara Entertainments (@SitharaEnts) May 15, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..