US Wife Killed Her Husband And Wrote A Book: తన జీవితాన్ని ఒంటరిగా లీడ్ చేయాలనుకున్న ఓ మహిళ.. చాలా తెలివిగా ప్లాన్ చేసి, తన భర్తను చంపింది. ఆపై ఏమీ ఎరుగనట్టు నటించి, పోలీసులకు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అంతేకాదు.. భర్త లేని జీవితం ఎంత దుర్భరమైందో, ఒంటరిగా జీవితాన్ని ఎన్ని ఇబ్బందులు పడాలో వివరిస్తూ.. ఒక పుస్తకం కూడా రాసింది. చివరికి.. ఏడాది తర్వాత భార్యే తన భర్తను హతమార్చిందని తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. పక్కా ఆధారాలను సేకరించి, ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Prabhas: ప్రభాస్ ప్యూర్ లవ్‌స్టోరీ? అంత రిస్క్ అవసరమా అధ్యక్షా?
కౌరీ డార్టెన్ రిచిన్స్ అనే మహిళ తన భర్త ఎరిక్‌తో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కట్ చేస్తే.. ఒక రోజు రాత్రి రిచిన్స్ పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త చనిపోయాడని చెప్పింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఆమె భర్త చనిపోయినట్లు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో.. సహజ మరణంగానే కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఫెంటానిల్ అనే డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్లే ఎరిక్ చనిపోయినట్లు తేలింది. దీంతో.. పోలీసులు రిచిన్స్‌కి తెలియకుండా, చాలా రహస్యంగా ఈ కేసుని విచారించడం మొదలుపెట్టారు. అయితే.. సరైన ఆధారాలు లభించకపోవడంతో, ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఈ గ్యాప్‌లో రిచిన్స్ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ అనుభవం ఎంతో కష్టంగా ఉంటుందని, దాన్నుంచి పిల్లలను సున్నితంగా మార్గనిర్దేశం చేసేలా భరోసా ఇచ్చే పుస్తకం ఇది అంటూ అమెజాన్‌లో అమ్మకానికి పెట్టింది.
Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్‌చరణ్ ఫ్యాన్స్!
ఇంతలో పోలీసులకు ఎరిక్ మృతికి సంబంధించి ఆధారాలు దొరికేశాయి. ఎరిక్ చనిపోయే రోజు అతడు, రిచిన్స్ కలిసి తమ ఇంట్లోనే వేలంటైన్స్ డే వేడుకలు జరుపుకున్నారని.. ఆ రోజు అతడు మిక్సిడ్ వోడ్కా డ్రింక్ తీసుకున్నాడని పోలీసులకు తెలిసింది. అంతకుముందు మూడు రోజుల క్రితమే రిచిన్స్ ‘హైడ్రోకోడోన్’ మాత్రలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డ్రగ్ సేవించడం వల్లే ఎరిక్ మరణించినట్లు రిపోర్ట్‌లో వెల్లడైంది. ఇలా ఎరిక్ మరణించిన ఏడాది తర్వాత పక్కా ఆధారాలు సేకరించి, రిచిన్స్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎరిక్ మరణించిన తర్వాతి రోజే రిచిన్స్ తన స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు పిల్లల హస్తం ఉందా? లేదా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.