Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya – Jyotika: దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరొందిన సూర్య, జ్యోతికల జంట తమ పెళ్లి బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సరికొత్తగా మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకుని అభిమానులను మురిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. 2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంతో ఒకటైన ఈ స్టార్ జంట, రెండు దశాబ్దాల తమ ఆనందకరమైన ప్రయాణానికి గుర్తుగా ఒక విదేశీ లొకేషన్లోని అందమైన చర్చిలో ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ క్రేజీ ఈవెంట్లో జ్యోతిక తెల్లటి వెడ్డింగ్ గౌన్ లో ఎంతో ఎలిగెంట్‌గా మెరవగా, సూర్య వైట్ సూట్ జాకెట్, బ్లాక్ ట్రౌజర్స్‌లో స్టైలిష్‌గా కనిపించారు. జ్యోతిక తన కుమారుడు దేవ్ చేయి పట్టుకుని ఐల్పై నడుచుకుంటూ రాగా, జ్యోతికను వెడ్డింగ్ గౌన్‌లో చూసి సూర్య ఆనందంతో కళ్లు చెమర్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ వేడుకకు సంబంధించిన క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జ్యోతిక.. ‘ది సీక్వెల్ – మా 20 ఏళ్ల లవ్ అండ్ వార్ సెలబ్రేషన్’ అంటూ ఒక అందమైన ఎమోషనల్ క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. ఇది ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ సెలబ్రేషన్ కాదని, మనస్పర్ధలు, సర్దుబాట్లు, త్యాగాలు, ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమించుకోవడానికి గుర్తుగా చేసుకున్న పండుగ అని ఆమె పేర్కొన్నారు. కేవలం కుటుంబ సభ్యులు, పిల్లలు దియా, దేవ్, సూర్య సోదరుడు కార్తితో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్ వేడుక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే, ఆయన చివరిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో కనిపించారు. మమిత బైజు కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2026 ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా తర్వాత ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నజ్రియా, నస్లెన్‌తో కలిసి ఆయన నటించనున్నట్లు సమాచారం. అలాగే టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సూర్య 48 కూడా లైనప్‌లో ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, మరోవైపు వ్యక్తిగత జీవితంలో జ్యోతికతో కలిసి 20 ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని ఇలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
• EXCLUSIVE : 20th Wedding Anniversary Celebration Of @Suriya_offl & #Jyothika 🤍 pic.twitter.com/6SEThcDQ5r
— Suriya Fans Team™ (@SuriyaFansTeam) September 15, 2026
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!