Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని, నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటీఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.…