సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు సితార. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన నాగ వంశీ ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథగా అనుకున్నప్పుడే రెండు భాగాలుగా చేయాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యలో సినిమా నిడివి ఎక్కువైంది అని రెండు భాగాలు చేయడం కానీ బడ్జెట్ ఎక్కువైందని రెండు భాగాలు చేయడం కానీ జరగలేదు అని అన్నారు.ఈ సినిమా పేపర్ మీదే రెండు భాగాలు అనుకొని ప్లాన్ చేసిన సినిమా అని వెల్లడించారు. మొదటి భాగం చూసిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ ను బట్టి సెకండ్ పార్ట్ ఎప్పుడు చేయాలి? అనేదాన్ని ప్లాన్ చేస్తామని అన్నారు. నాకు రెండు భాగాల సినిమా చేస్తున్నానని చెప్పుకునే సరదా లేదు. మాటల సందర్భంలో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెబుతున్నాను. టైటిల్ కూడా ఫస్ట్ పార్ట్ ఏమీ ఉండదు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కథ రెండో భాగం లో పెట్టి మొదటి భాగం సస్పెన్స్ తో నడిపించడం లేదు.. మొదటి భాగం ఒక్కటి చూసిన ఇది సినిమా సినిమా గాని అనిపిస్తుందని నాగ వంశీ అన్నారు.
Naga Vamsi: కొడతానంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ
ఈ సినిమా కంటెంట్ చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చిందా అని మీరు షాక్ అవుతారు. ఈ మధ్యనే నేను మా బాబాయ్, ఎడిటర్ నవీన్ ఫస్ట్ ఆఫ్ చూసుకున్నాం. జెర్సీ తీసిన గౌతమ్ ఏనా ఈ సినిమా తీసింది అనేలా ఈ సినిమా అంటుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ షాక్ కచ్చితంగా ఫీల్ అవుతారు. సినిమా మీద మీరు ఎంత అంచనాలు పెట్టుకుంటారో నేను చెప్పలేను కానీ సినిమా చూసి మాత్రం షాక్ అవుతారు.. మేము ఎడిట్ చేయని రెండు గంటల ఫస్ట్ హాఫ్ చూస్తేనే మాకు అలా అనిపించింది. జెర్సీ తీసిన సాఫ్ట్ డైరెక్టర్ ఏనా ఈ సినిమా తీసింది అనేలా ఈ సినిమా చూసి తీశాడు. మా ఎడిటర్ తో నాకు ఐదారు సంవత్సరాల జర్నీ. ఆయన నోట్లో నుంచి ఈ సినిమా బాగుంది అని రావడం చాలా రేర్. అలాంటిది తనంతట తానే ఫోన్ చేసి ఇలా చూశాను అదిరిపోయింది నువ్వు చూడు అని చెప్పాడు. ఫ్యాన్స్ నన్ను ట్విట్టర్లో వేసుకుంటున్నారు అప్డేట్ ఏది అప్డేట్ ఏది? అని. నిజానికి అప్డేట్ హీరో డైరెక్టర్ ఇస్తే కదా నేను వదిలేది నేను దాచుకుని మాత్రం ఏం చేస్తానని ఆయన అన్నారు.