చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కళ్ల ముందు తిరిగిన వాళ్లే.. అంతలోనే మాయమైపోతున్నారు. నేటి కాలంలో చావులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెద్ద వాళ్లకు గుండెపోటులు వచ్చిన వార్తలు వినేవాళ్లం. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా గుండెపోటులు రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇది కూడా చదవండి: Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్’లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. వీడియో వైరల్
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ప్రముఖ అమెరికా ఇన్‌ఫ్లుయెనర్స్ కరోల్ అకోస్టా(27) అకాల మరణం చెందింది. న్యూయార్క్‌లో కుటుంబంతో కలిసి విందు భోజనం చేస్తుండగా శ్వాస తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరికి గురైంది. అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబం షాక్‌కు గురైంది. ఆమె మరణాన్ని కరోల్ అకోస్టా సోదరి కాట్యాన్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.’’ అని హృదయపూర్వక నివాళి అర్పించింది. ‘‘నీలాంటి సోదరిని నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నా సోదరి శాంతితో ఉండాలి.’’ అంటూ పేర్కొంది.
ఇది కూడా చదవండి: VD 12: జెర్సీ చేసిన డైరెక్టరేనా? వీడీ 12 చూసి షాక్.. హైపెక్కించేస్తున్న నాగవంశీ
కరోల్ అకోస్టా జనవరి 3న మరణించింది. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైంది. కానీ అంతలోనే ప్రాణాలు కోల్పోయింది. అయినా కూడా ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె ఎందుకు చనిపోయిందో కారణం తెలియలేదు. ఇంకా పోస్టుమార్టం రిపోర్టు అందలేదు. చావుకు గల కారణంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోల్ అకోస్టా మరణవార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా అభిమానులు నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. చిన్న వయసులో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసిందంటూ ఆమె సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం అక్కడికి వెళ్తా