బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పై టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకింత ఫైర్ అయ్యాడు. అందుకు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0పై కారణం అయింది. రాజాసాబ్ ట్రైలర్ 2.0 రిలీజ్ అయిన సందర్భంగా బాలీవుడ్ లి తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌లో సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ పేరును ప్రస్తావించలేదు. దాంతో కొందరు తమన్ అభిమానులు దీనిపై తరణ్ ఆదర్శ్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Also Read : Tollywood : 2025 ప్లాప్ హీరోయిన్స్ వీరే.. వచ్చే ఏడాదైనా హిట్ అందుకుంటారా ?
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై స్వయంగా తమన్ స్పందించాడు. నెటిజన్ల చర్చకు ఎంట్రీ ఇచ్చిన తమన్, తన ట్విట్టర్ ఖాతా నుంచే “Music by Thaman S. This is my Twitter ID” అని ట్యాగ్ చేస్తూ ఘాటుగా బదులిచ్చారు. తమన్ చేసిన ఈ కామెంట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హాట్ టాపిక్ అయ్యింది. అయితే తరణ్ ఆదర్శ్ ఉద్దేశపూర్వకంగానే తమన్ ను పేరు ప్రస్తావించలేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన టైమ్ లో తమన్ ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కానీ సెకెండ్ సాంగ్ విషయంలో మాత్రం మెప్పించాడు తమన్. ఇక గతంలో వచ్చిన రాజాసాబ్ ట్రైలర్ విషయంలోను తమన్ ఫ్యాన్స్ ను డిజప్పోయింట్ చేశాడు. కానీ రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ 2.0కు మాత్రం థమన్ ఇచ్చిన ఆర్ ఆర్ అదిరిపోయింది.
And
It has Music by – Thaman S !! 💣This is my twitter id @MusicThaman 📈 https://t.co/YbjWA0iewr
— thaman S (@MusicThaman) December 29, 2025