థాయిలాండ్ గాయకుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఓ షాకింగ్ కథను పంచుకున్నారు. 1998లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 101 మంది మరణించిన తాను మాత్రం బయటపడ్డానని వెల్లడించారు. ఆ సమయంలో తాను సీటు నంబర్ 11Aలో కూర్చున్నట్లు తెలిపారు. ఆశ్యర్యం ఏంటంటే.. ఇటీవలి ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ సీటు నంబర్ కూడా ఇదే. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో.. 34 ఏళ్ల విశ్వాస్ కుమార్ ప్రమాదం నుంచి అత్యంత స్పల్ప గాయాలతో ప్రమాద స్థలి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. తాను విమానంలోని 11 A సీటులో కూర్చున్నానని.. ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చానని అతడు చెప్పటంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఇదే ఘటన 27 ఏళ్ల కిందట కూడా జరిగింది.
READ MORE: WTC Final 2025: ఫైనల్‌లో టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్..
“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల క్రితం డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్‌వేస్ విమానం (TG261) దక్షిణ థాయిలాండ్‌లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోవడంతో అందులోని 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 45మంది మాత్రమే గాయాలతో బయటపడగా.. ఆ సమయంలో 11A సీటులో కూర్చున్న నేను మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. మళ్లీ ఇప్పుడు అలాగే జరిగేసరికి తాను షాక్ అయ్యాను. ఆ విమాన ప్రమాదం నాకు పునర్జర్మ. కొన్ని రోజుల పాటు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయాను. భయంతో పదేళ్ల పాటు ఏ విమానంలో ప్రయాణించలేదు. ” అని థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ విషాదంలో తమ బంధువులను కోల్పోయిన వారందరికీ సంతాపం తెలియజేశాడు..
READ MORE: Food Safety Raids : సమోసా సెంటర్ కాదు.. ఆరోగ్యానికి ఓ ఓపెన్ ఛాలెంజ్..!
దీంతో నెటిజన్లు ఇప్పటికే 11 A సీటు ప్రత్యేకత ఏమిటా అని సెర్చ్ చేస్తున్నారు. అంతలో ఆశ్చర్య పోయే వివరాలు తెలిశాయి. బోయింగ్ విమానంలో 11A సీటు.. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (PAC)కి సమీపంలో ఉండటం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దీంతో ఈ సీటును సాధారణంగా ఎవరూ ఎంచుకోరు. ముఖ్యంగా పది గంటలపైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే.. 11ఏ సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. యూరోప్ దేశాల్లోనైతే.. ఈ సీటు మీద బోలెడు జోకులూ ఉన్నాయి. అలాగే ఈ 11ఏ సీట్ ధర రూ. 1 లక్ష పైగా ఉంటుందని తెలుస్తోంది. కానీ. రమేష్, రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ ఈ సీటును ఎంచుకున్నారు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో గానీ.. మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డారు.