Humanoid Robot Optimus: టెస్లా ఆదివారం తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసింది. వెంటనే వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే పది మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. ఇందులో రోబోట్ ఆప్టిమస్ రకరకాల పనులు చేయడం మనం చూడవచ్చు. వీడియో మొదట్లో రోబోట్ తన ముందు వచ్చిన కొన్ని వస్తువులను కలర్ ఆధారంగా సులువుగా క్రమబద్దీకరించింది. దాని ముందు నీలి రంగు, ఆకుపచ్చ రంగు వస్తువులు ఉండగా అది బ్లూ కలర్ వాటిని దానికి సంబంధించిన ప్లేట్ లో, గ్రీన్ కలర్ వాటిని దానికి సంబంధించిన ప్లేట్ లో ఉంచింది. ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చిన ఓ వ్యక్తి దానికి అంతరాయం కలిగించాడు. బ్లూ, గ్రీన్ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. అయినా ఆప్టిమస్ వాటిని తీసి మళ్లీ సరైన ప్లేట్ లో పెట్టింది.
Also Read: Stock Market Opening: ఐదవ రోజు ఒత్తిడిలో మార్కెట్.. దయనీయంగా సెన్సెక్స్-నిఫ్టీ పరిస్థితి
ఇక తరువాత ఆప్టిమస్ యోగ చేయడం మొదలు పెట్టింది. ఒక కాలు మీద నిలుచోని బాడీని స్ట్రెచ్ చేయడం, బ్యాలెన్డ్స్ గా ఉండటం లాంటివి చేసింది. ఇది విజన్,జాయింట్ పొజిషన్ ఎన్‌కోడర్‌లను ఉపయోగించి దాని ఇది విజన్ మరియు జాయింట్ పొజిషన్ ఎన్‌కోడర్‌లను ఉపయోగించి దాని భంగిమలను ఖచ్చితంగా చేయగలుగుతుంది. ఈ వీడియోలో వృక్షాసనం వేసిన రోబో నమస్తేను చాలా చక్కగా పెట్టింది. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన కంపెనీ “ఆప్టిమస్ ఇప్పుడు వస్తువులను స్వయంప్రతిపత్తితో క్రమబద్ధీకరించగలదు. దీని న్యూరల్ నెట్‌వర్క్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ శిక్షణ పొందింది: వీడియో ఇన్, కంట్రోల్స్ అవుట్. ఆప్టిమస్ దాని యోగా దినచర్యను మెరుగుపరచడంలో సహాయం చేయడానికి మీరు మాతో చేరండి” అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన యూజర్లు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పరిశోధన చాలా వరకు ముందుకు వెళ్లింది. ఇంత తొందరగా ఈ విధంగా పురోగతి సాధిస్తుందని అనుకోలేదు అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇంకా ఈ ఆప్టిమస్ ఏం ఏం చేయగలదో చూడాలని ఆసక్తిగా ఉందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటుంది.
Optimus can now sort objects autonomously 🤖
Its neural network is trained fully end-to-end: video in, controls out.
Come join to help develop Optimus (& improve its yoga routine 🧘)
→ https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r
— Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023