Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Terrorist Killed In Encounter With Security Forces In Jammu And Kashmir Kulgam

Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

Published Date :May 9, 2024 , 12:38 pm
By Suresh Maddala
Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
  • Follow Us :
  • google news
  • dailyhunt

దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ దార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. గత సోమవారం రాత్రి మొదలైన కాల్పులు దాదాపు 40 గంటల తర్వాత గురువారం ఉదయం ముగిశాయి. ఉగ్రవాదుల నుంచి అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Smriti Irani: ఎక్కడ డిబేట్ పెట్టిన నేను రెడీ.. ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్..

కుల్గామ్‌లోని రెడ్వానీ పైన్‌లో దాదాపు 40 గంటల పాటు జాయింట్ ఆపరేషన్ కొనసాగిందని భారత సైన్యం ట్విట్టర్‌లో తెలిపింది. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని రెడ్వానీ పైన్ ప్రాంతంలో సోమవారం-మంగళవారం మధ్య రాత్రి ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకడైన బాసిత్ దార్ 18కి పైగా కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. అమాయక పౌరులను హత్య చేయడం మరియు మైనారిటీలపై దాడులకు ప్లాన్ చేయడంతో సహా కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: Air India Express: ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులపై వేటు..

బాసిత్ దార్‌పై 10 లక్షల రూపాయల నగదు బహుమతిని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. మరియు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. 2011లో కుల్గామ్‌లో ఇద్దరు స్థానికేతరులను హత్య చేసిన కేసులో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.ఈ నెల ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు భారత వైమానిక దళ సభ్యుడ్ని చంపారు. 15 నిమిషాల వ్యవధిలో వాహనంపై దాదాపు 200 బుల్లెట్లు దూసుకెళ్లాయి.

హతమైన ఉగ్రవాదులు 18 మందిని హత్య చేశారని.. అలాంటి దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేయడం తమకు పెద్ద విజయమని భద్రతా బలగాలు చెప్పాయి. మే 4న పూంచ్ జిల్లాలో భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో భారత వైమానిక దళ అధికారి మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంపై భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి. ఆ దాడుల్లో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను బుధవారం విడుదల చేశారు. వారిలో పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, ఉగ్రవాది హడూన్ అలియాస్ హుడూన్, లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జాగా గుర్తించారు. ప్రస్తుతం వీరిని కనిపెట్టే పనిలో ఉన్నట్లు వివరించారు.

ఇది కూడా చదవండి: Pakistan : పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. ఏడుగురు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • encounter
  • JammuKashmir
  • Kulgam
  • security forces
  • terrorist killed

తాజావార్తలు

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

  • Vivo Y11 5G, Vivo Y21 5G: వివో Y11 5G, వివో Y21 5G రిలీజ్ కు రెడీ.. కీ డీటెయిల్స్ ఇవే

  • DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్‌.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..

  • Pakistan Cancels Republic Day Parade: పాక్‌లో తీవ్ర ఇంధన కొరత..! గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కూడా రద్దు

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions