Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
- యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్..
- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
- క్రిమినల్ పరువు నష్టం కేసులో చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై ఢిల్లీ కోర్ట్ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయనకు ఈ వారెంట్ జారీ చేశారు. బీజేపీకి మద్దతుగా ఉన్న ‘ఐ సపోర్ట్ నరేంద్రమోడీ’ ఫేస్బుక్ పేజ్ వ్యవస్థాపకుడు వికాస్ పాండే దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సాకేత్ కోర్టులో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనమ్ రయీస్ ఖాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న ధ్రువ్ రాఠీ గతంలో కోర్టు సమన్లు, రెండుసార్లు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అయినప్పటికీ కోర్టుకు హాజరుకావడంలో సమస్యలు ఎదురుకావడం, వారెంట్లు అందచేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో తాజాగా మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Also Read
- India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
- Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
ధ్రవ్ రాఠీ యూట్యూబ్ వీడియో ‘‘బీజేపీ ఐటీ సెట్ పార్ట్ 2’’ లో తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని వికాస్ పాండే ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వల్ల తన పరువుకు నష్టం కలిగిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తదుపరి విచారణను 2026 డిసెంబర్ 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
సీజేపీ ఉద్యమం సమయంలో ధ్రువ్ రాఠీ అరెస్ట్..
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ధ్రువ్ ఠారీ అక్టోబర్‌లో భారత్ వచ్చారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ పార్టీ ఆందోళనలు చేపట్టింది. అక్టోబర్ 8న బెంగళూరులో జరిగిన నిరసనలో ధ్రువ్ రాఠీ పాల్గొన్నారు. అనంతరం అక్టోబర్ 10న ఢిల్లీలో జరగాల్సిన ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనకు ముందు గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న ఆయన నివాసం నుంచి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీని తర్వాత అక్టోబర్ 11 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ధ్రువ్ రాఠీని విడుదల చేశారు. ఆ తర్వాత తనను అరెస్ట్ చేయలేదని, కిడ్నా్ప్ చేశారని ఆరోపించారు. అక్టోబర్ 10 ఉదయం సుమారు 7 గంటల సమయంలో సాధారణ దుస్తుల్లో ఉన్న 20 మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించారని, తాను నిద్రపోతుండగానే అక్కడి నుంచి తీసుకెళ్లారని ధ్రువ్ రాఠీ చెప్పారు. తనను అనేక పోలీస్ స్టేషన్లు తిప్పారని, 20 గంటలకు పైగా తన ఫోన్ ఉఫయోగించేందుకు అనుమతి ఇవ్వలేదని, తన లాయర్‌తో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
-
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!