Terrorist Attack: 2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్…
భారత్ సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు.