తెలుగు నటశిఖరం నేలకొరిగింది. ఎన్నో అద్భుత చిత్రాలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం 4 గంటల సమయంలో మృతి చెందారు. అయితే.. నేడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. కృష్ణ మరణంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపంగా నేడు షూటింగ్స్‌ను బంద్ చేస్తున్నట్లు టాలీవుడ్ నిర్మాతల మండి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నేడు ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే.. కృష్ణ మృతికి సంతాపంగా పలుచోట్ల సినిమా హాళ్లు మూసివేశారు. నిన్న రాత్రి నానక్‌రామ్ గూడలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని ఉంచగా.. నేడు ఉదయం కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించారు.
Also Read : Superstar Krishna : నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు
మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచనున్నట్లు కుంటుబ సభ్యులు తెలిపారు. అనంతరం మహా ప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే.. ఒకే సంవత్సరంలో మహేశ్‌బాబు కుటుంబంలో ముగ్గురు మరణించడం బాధకరమైన విషయం. మహేశ్‌బాబు, ప్రముఖులు అందరూ మహేశ్‌కు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. కృష్ణ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ 300 పై చిలుకు సినిమాల్లో నటించారు.