Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
- తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్
- గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
- ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ అందింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు పచ్చజెండా లభించింది. టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెండేడ్ భారత్‌నెట్ కార్యక్రమం (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై కూడా కేంద్ర మంత్రి సింధియాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని సింధియా హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే ఆలోచనపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ వెన్నెముక వైపు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతోంది. టీ-ఫైబర్ నెట్వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనుంది. మొదటి దశలో దెబ్బతిన్న నెట్వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేయనున్నారు.
Also Read
- GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
- Telangana : దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
- Telangana Congress: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
- Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
తాజావార్తలు
-
Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
-
మందు అనుకుని ఎయిర్‌పాడ్స్‌ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
-
Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్‌గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
-
SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
-
US-Hormuz: హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!