SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరుగుతున్న ఈ చావో రేవో పోరులో రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 6 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు రాబట్టిందంటే వైభవ్ బ్యాటింగ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. సూర్యవంశీ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి క్రీజులో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 19 పరుగులతో అతనికి సహకారం అందించాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడే క్రమంలో వైభవ్ సూర్యవంశీ యూనివర్స్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డును తన లిస్ట్‌లో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో కలిపి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ మొత్తం సిక్సర్ల సంఖ్య 60కి చేరింది. ఇంతకుముందు 2012 సీజన్లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ 59 సిక్సర్లు బాదాడు. గత 14 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ ఆల్‌టైమ్ రికార్డును కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ అధిగమించడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ బ్యాటర్లు..
వైభవ్ సూర్యవంశీ (2026) – 61 సిక్సర్లు
క్రిస్ గేల్ (2012) – 59 సిక్సర్లు
ఆండ్రీ రస్సెల్ (2019) – 52 సిక్సర్లు
క్రిస్ గేల్ (2013) – 51 సిక్సర్లు
జోస్ బట్లర్ (2022) – 45 సిక్సర్లు
హైదరాబాద్ బౌలర్ ఈషాన్ మలింగ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో వైభవ్ మరింత ధాటిగా ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ 327.78 గా నమోదు కావడం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్లేఆఫ్స్ లాంటి కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ తీరు చూస్తుంటే భవిష్యత్తులో అతను ఇండియన్ క్రికెట్లో ఒక సంచలనంగా మారబోతున్నాడని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!