Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
- రాష్ట్రవ్యాప్తంగా 12 మంది తహశీల్దార్ల బదిలీ
- డీఆర్ఓ, ఎస్డీసీ పోస్టుల్లో కొత్త నియామకాలు
- పరిపాలనా అవసరాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వెంటనే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahsildar Transfers : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులకు తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO) , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC, Land Acquisition) గా కొత్త పోస్టింగులను కేటాయించారు. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి నివేదికను, అధికారులు విధుల్లో చేరిన వివరాలను ప్రభుత్వానికి తక్షణమే సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) తో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన వారిలో నిర్మల్ తహశీల్దార్ మోతీరామ్ ఎ. ను మంచిర్యాల డీఆర్ఓగా, కరీంనగర్‌కు చెందిన బి. రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్ఓగా, పెద్దపల్లికి చెందిన కె.వై. ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్ఓగా నియమించారు. అలాగే వనపర్తి నుంచి ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్ఓగా, ఖమ్మం నుంచి వి. రవికుమార్‌ను ములుగు డీఆర్ఓగా, మేడ్చల్-మల్కాజిగిరి నుంచి జె. స్వామిని కరీంనగర్ డీఆర్ఓగా, నాగర్‌కర్నూల్ నుంచి ఎ. పాండును కామారెడ్డి డీఆర్ఓగా బదిలీ చేశారు. వీరితో పాటు జనగామ తహశీల్దార్ సిహెచ్. శ్రీకాంత్‌ను మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించగా, ఎం. సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట) ను సిద్దిపేట ఎస్డీసీగా, ఎం. రమాదేవి (ఖమ్మం) ను నల్గొండ ఎస్డీసీగా, జి. కుమారస్వామి (పెద్దపల్లి) ను సిరిసిల్ల ఎస్డీసీగా , ఎన్. వెంకట్ రెడ్డి (కరీంనగర్) ను కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ) గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!