Telangana : దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
- ఇంటర్మీడియట్ విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ లో వెరైటీలు...
- వయస్సుకు తగిన పోషకాలు అందేలా రూపకల్పన
- 1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం..
- మధ్యాహ్న భోజనం... బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు ఏటా రూ.180 కోట్ల వ్యయం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 12న ప్రారంభం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : దోశ… పూరి.. మిల్లెట్ ఇడ్లీ… బోండా .. ఉప్మా.. ఇవి హోటల్ మెనూ కాదు…. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న బ్రేక్ ఫాస్ట్… చట్నీ, సాంబర్, మిక్స్డ్ వెజిటబుల్ కుర్మాతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రుచికరమైన, పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందనుంది. కీలకమైన ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన బలవర్ధక ఆహారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించడంతో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది.
ఇప్పటి వరకు దేశంలో పాఠశాల విద్యార్థులకే మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.. కళాశాల విద్యార్థులకు ఏ రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. కానీ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దేశంలోనే తొలిసారి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది…
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ఇంటర్ విద్యార్థులకు ఎందుకు ప్రాధాన్యం…
పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు ఉండడంతో విద్యార్థులు పదో తరగతి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా
విద్యాభ్యాసం చేస్తున్నారు. జూనియర్ కళాశాలలు మండల కేంద్రాలు, ఆపై స్థాయి పట్టణాలు, నగరాల్లోనే ఉండడంతో గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేల నుంచి విద్యార్థులు కళాశాలలకు వెళ్లడం కష్టమవుతోంది. ఉదయం సమయానికి బ్రేక్‌ఫాస్ట్ చేసే పరిస్థితి లేకపోవడం, బ్రేక్‌ఫాస్ట్ చేసిన మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేందుకు సమయం లేకపోవడంతో అర్ధాకలితో విద్యార్థులు ఇబ్బంది పడేవారు.. ఈక్రమంలోనే చాలా మంది కళాశాల విద్యకు దూరమవుతున్నారు.. దానికతోడు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికులు బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే.. ఆయా కుటుంబాల్లోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదోతరగతి తర్వాత చదువు మానేసి పనులకు వెళుతున్నారు.. ఈ నేపథ్యంలో పదోతరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు…
జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సులకు అనుగుణంగా…
ఇంటర్మీడియట్ చదివే వారి వయస్సు 15 నుంచి 18 మధ్య ఉంటుంది. ఇది కౌమార దశ.. విద్యార్థినీవిద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగే దశ.. ఈ వయస్సులో వారికి పోషకాలతో కూడిన ఆహారం అవసరం.. జాతీయ పోషకాహార సంస్థ (National Institute of Nutrition) సిఫార్సుల ప్రకారం.. కౌమార దశలోని వారికి రోజుకు 1029 కిలోకేలరీలు-30-32 గ్రాముల ప్రోటీన్ అవసరం… NIN సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంతగా పోషకాలు అందించేలా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకానికి రూపకల్పన చేసింది.
NIN సిఫార్సుల మేరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న పోషకాహారం లోపాలు, విటమిన్ లోపాలు, ఐరన్ డెఫిషీయన్సీని అధిగమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థినీలు కౌమార దశలో ఎదుర్కొనే పలు సమస్యలకు ఈ పోషకాహారంతో చెక్‌పడనుంది. నాణ్యతతో కూడిన పోషకాహారం అందడంతో విద్యార్థినీవిద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టి రాణించే అవకాశం ఉంటుంది…
కళాశాలలోని వారంతా ఒకే చోట కలిసి కూర్చొని తినడంతో సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గడంతో పాటు వారి మధ్య చక్కని స్నేహపూరిత వాతావరణం నెలకొంటుంది.
తొలి రోజు 64 కళాశాలల్లో..
ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్, 12వ తేదీన ప్రారంభిస్తారు.. తొలి రోజు 41,250 మంది విద్యార్థులు ఈ పథకంలో భాగస్వాములవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభమైన తర్వాత ఫస్టియర్, సెకండియర్ కలిపి రోజుకు 1.92 లక్షల మంది బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం చేయనున్నారు.. ఇంటర్మీయట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్లను వెచ్చించనున్నారు..ఈ మొత్తాన్ని విద్యార్థులపై చేసే వ్యయంగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది…
బ్రేక్ ఫాస్ట్ మెనూ..
తొలి రోజు… దోశ+చట్నీ
రెండో రోజు…. మిల్లెట్ ఇడ్లీ+సాంబార్
మూడో రోజు… పూరీ+మిక్స్డ్ వెజిటెబుల్ కుర్మా
నాలుగో రోజు… బోండా+చట్నీ
అయిదో రోజు… ఇడ్లీ+చట్నీ
ఆరో రోజు…. ఉప్మా+చట్నీ/ సాంబార్
రోజు విడిచి రోజు 150ml పాలు…
(వీటికితోడు మరింత పోషకాలు అందించే వివిధ పదార్థాలను పరిశీలిస్తున్నారు.. త్వరలోనే వాటిపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.)
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!