ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం నాగరాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడని నిర్దారించడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజుకు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద…