NTV Telugu Site icon

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ

Supreme Court

Supreme Court

నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.

READ MORE: Minister Seethakka : సంక్షేమం అనే పదానికి అర్థమే మారిపోతుంది

గత విచారణ సందర్భంగా స్పీకర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు రిజిస్టర్ ద్వారా అత్యు్న్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తగినంత సమయం అంటే ఏంటో స్పష్టం చేయాలని స్పీకర్ తరపు న్యాయవాదిని సుప్రీం ప్రశ్నించింది. గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు నోటీసులకు రిప్లై ఇచ్చింది. తాము పార్టీ మారలేదని గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు.

READ MORE: Nicholas Pooran: 6,6,6,6,4… ఒకే ఓవర్ లో పూరన్ ఊచకోత