సంక్షేమం అనే పదానికి అర్థమే మారిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. బీపీఎల్ కింది వర్గాలకు ఆర్థిక సాయం చేసే పద్ధతి పోయిందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. చెరువులను తెంపి చాపలు పంచే విధానంగా సంక్షేమము మారిందన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ, పి ఆర్ ఆర్ బి, మహిళా సీ సంక్షేమ శాఖలకు గతంతో పోలిస్తే అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని.. అందుకే ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా తెలంగాణ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ బడ్జెట్‌ను సహించలేని కొన్ని వర్గాలు రకరకాలుగా మాట్లాడారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సునీత లక్ష్మారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మహిళ అసిస్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారని.. కాంగ్రెస్ ఏమి చేయలేదని చెప్పడం అంటే మన చరిత్రను మనం కించపరచుకోవటం అవుతుందన్నారు.
READ MORE: Nicholas Pooran: 6,6,6,6,4… ఒకే ఓవర్ లో పూరన్ ఊచకోత
టీఆర్ఎస్ పాలనలో మహిళలను పట్టించుకోలేదని.. మొదటి ఐదేళ్లు మహిళా మంత్రులు లేరని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు.. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు.. రైతులకు రుణమాఫీ చేశాం, సన్న వోడ్లకు బోనసిచ్చాం, మహిళలకు వడ్డీలు లేని రుణాలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3000 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టిందని విమర్శించారు. మహిళల రెక్కల కష్టం ఆభయ హస్తం పొదుపు సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కాలమైతే తమ ఖాతాలో, కరువు వస్తే ఇతరుల ఖాతాల్లో వేయడం టీఆర్ఎస్ నైజమని మండిపడ్డారు. మహిళా సాధికారత కోసం ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, 20 రకాల వ్యాపారాలు మహిళా సంఘాలకు ఇస్తున్నామని.. మొదటి 15 నెలల్లోనే 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
READ MORE: CM Chandrababu: రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..