Vice Presidential Election:ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా అలయన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఇండియా అలయన్స్ కు చెందిన కనీసం 20 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఊహించిన దానికంటే 25 ఓట్లు ఎక్కువగా పొందారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థికి మద్దతుదారుల పూర్తి స్థాయిలో ఓట్లు రాలేదు.
Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం…
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఈ అంశంపై పార్టీ మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
Raja Singh : తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అడ్డుగా ఉన్న తనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అయితే.. కవిత కామెంట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని తాను భావిస్తున్నానంటూ తెలిపారు. బీజేపీకి…
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. "ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరయింది కాదు.
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.…