టెక్నికల్‌గా తానింకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్‌లపై గద్వాల ఎమ్మెల్యే స్పందించారు.
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.…
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనికోసం మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు..