Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామన్నారు ఎన్నికల అధికారులు. ఇక ఎన్నికల్లో భాగంగా 565 మండలాల్లో ఎంపీటీసీ (MPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి.
Indira Canteen: కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం
ఇందులో భాగంగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ(ZPTC) మొదటి విడత ఎన్నికలు జగనున్నాయి. ఇక అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 4న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జగనున్నాయి. ఇక చివరగా నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తంగా రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.