రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు నాలుగు లక్షల 59 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.సోమవారం నుండి నవంబర్ మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి… ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల 228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు… పరీక్షల నిర్వహణకు గానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి,17 వందల 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వారినే పరీక్షల విధుల్లో నియమించారు. ప్రతీ పరీక్ష కేంద్రం లో ఒకటి లేదా రెండు ఐసోలేషన్ రూంలను ఏర్పాటు చేయనున్నారు.విద్యార్థులు కరోన భారిన పడితే వారికి తరవాత పరీక్ష రాసే అవకాశం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా పరీక్ష రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి కోసం మానసిక నిపుణులను ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ….కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటి ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతి ఉండదని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో ఉన్న విద్యార్థులు..ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయకుండానే సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయ్యారు… ప్రమోట్ చేసే సమయంలోనే కోవిడ్ ప్రభావం తగ్గాక మొదటి సంవత్సరం పరీక్షలు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది… ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గిందని… దానిని దృష్టిలో పెట్టుకొనే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.నవంబర్ ఒకటి నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది.