Strike Postponed: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని సమాఖ్య ప్రతినిధులు కలసి తమ సమస్యలను వివరించారు. అనంతరం వారు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం దీపావళి లోపల రూ.300 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెను, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని అక్టోబర్ 23వ తేదీ వరకు (దీపావళి మరుసటి రోజు వరకు) వాయిదా వేయాలని నిర్ణయించారు.
Local Body Elections: యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
అయితే, దీపావళి నాటికి బకాయిలు విడుదల కాకపోతే.. అక్టోబర్ 23న మళ్లీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని సమాఖ్య స్పష్టం చేసింది. ఇక, దసరా ముందు విడుదల చేసిన రూ.200 కోట్ల బకాయిల్లో సుమారు 70 మైనారిటీ, జనరల్ కళాశాలలకు ఒక్క రూపాయి కూడా అందలేదని సమాఖ్య పేర్కొంది. ప్రభుత్వం వెంటనే నిధుల విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
Sanju Samson: 10 ఏళ్లలో 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడా.. భావోద్వేగం చెందిన సంజు శాంసన్!