Strike Postponed: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని సమాఖ్య ప్రతినిధులు కలసి తమ సమస్యలను వివరించారు. అనంతరం వారు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం దీపావళి లోపల రూ.300 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెను, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని అక్టోబర్ 23వ తేదీ వరకు (దీపావళి మరుసటి…
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.