Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు (గురువారం) యథావిధిగా నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ మాత్రం ఆటంకం లేకుండా ముందుకు సాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారించింది. విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు జరిగినప్పటికీ, తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే, రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
Sanju Samson: 10 ఏళ్లలో 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడా.. భావోద్వేగం చెందిన సంజు శాంసన్!
హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడిన వెంటనే, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో రాష్ట్ర మంత్రులతోపాటు మరికొందరు ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ సహా ఇతర ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈరోజు హైకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల తీరుపై చర్చించి, రేపు హైకోర్టులో అనుసరించాల్సిన అంశాలపై అడ్వకేట్ జనరల్‌తో మంత్రులు మంతనాలు జరిపారు.
రేపు విడుదల కానున్న నోటిఫికేషన్ తెలంగాణలోని 31 జిల్లాల్లోని 565 మండలాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఆయా జిల్లాల్లోని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
Rohit Sharma: పగలబడి నవ్వకున్న రోహిత్ శర్మ.. వీడీయో చూస్తే మీక్కూడా నవ్వాగదు!
మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్లో 2,963 ఎంపీటీసీ స్థానాలకు, 292 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇందుకు గాను అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయొచ్చు. వీటికి అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొదటి విడత జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.