BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్‌లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ కాదని.. తెచ్చుకున్నది తెలంగాణ సమాజం అని ఎంపీ లక్షణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎంపీ లక్షణ్ మాట్లాడారు.
బీజేపీ ఎంపీ లక్షణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ ఉద్యమానికి ఏబీవీపీ నాంది పలికింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కాలరాసింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీఅనేక మందిని పొట్టనపెట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, పార్లమెంట్‌లో గళం విప్పింది. కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించింది. యూపీఏ ప్రభుత్వం కళ్లుతెరవాలని శ్రీకాంత్ చారితో మొదలు పెడితే.. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. 12 వందల మంది అమరులు అయ్యారు. వారి బలిదానాలతో తెలంగాణ వచ్చింది. బలిదేవత సోనియా గాంధీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి భక్తుడు అయ్యాడు’ అని అన్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Also Read: CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు!
‘ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంని అనుభవిస్తుంది. ఏ విధంగా సలహాదారుగా ఉన్నావో అని కోదండ రామ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం, కోదండ రామ్ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఉచిత గ్యారంటీలు ఓట్లు దందుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. సుష్మ స్వరాజ్ మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు. ఆమెను విస్మరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిపోతే.. ఈ సీఎం ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచుకోవడం కోసం రాజీపడుతున్నారు. పోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో.. లేకుంటే నీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. 5 ఏళ్లు నీకు కష్టమే’ అని బీజేపీ ఎంపీ లక్షణ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..