The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో భారీ రికార్డ్స్ సృష్టిస్తుంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ రూ.37 కోట్లకు సొంతం చేసుకుంది. నాని కెరీర్లో ఇప్పటివరకు ఏ చిత్రానికీ ఈ స్థాయిలో నైజాం బిజినెస్ జరగకపోవడంతో ఇది రికార్డు డీల్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని ఇప్పటివరకు కనిపించని మాస్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించనున్నారని చిత్రబృందం చెబుతోంది. నానికి జోడీగా కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ కీలక ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “ఆయా షేర్” పాట సోషల్ మీడియాలో మోతమోగిపోతుంది. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
అత్యున్నత నిర్మాణ విలువలు, బలమైన కథ, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు సినీ పరిశ్రమలో పెరిగిపోయాయి.
నాని పారడైజ్ మూవీ డిస్ట్రిబ్యూషన్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం
తాజాగా పారడైజ్ మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్
వరుస హిట్లలో ఉన్న నాని మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 37 కోట్ల అవుట్‌రైట్ రేట్ కి కొనుగోలు చేసినట్లు సమాచారం…#Nani #TheParadise… pic.twitter.com/Fs713S2Fps
— NTV Breaking News (@NTVJustIn) July 17, 2026
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!