Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే థియేటర్లలో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డును నమోదు చేసి, భారతీయ సినీ ప్రమోషన్లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. తాజా గణాంకాల ప్రకారం, ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే ఏకంగా 5.33 లక్షల షేర్లు సాధించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా షేర్ చేయబడిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌గా ఇది కొత్త రికార్డును సృష్టించింది. అభిమానులు ఈ పోస్టర్‌ను భారీ స్థాయిలో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక డిజిటల్ వేడుకలా మార్చేశారు. ఈ రికార్డు ప్రభాస్ డిజిటల్ క్రేజ్‌కు మరో నిదర్శనంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి ప్రభాస్ మరో హీరో రికార్డును కాదు, తన సొంత రికార్డునే బద్దలు కొట్టారు. గతంలో ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ 5.19 లక్షల షేర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ‘ఫౌజీ’ దానిని అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఆధిపత్యం మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పోస్టర్ అభిమానులను అంతగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం అందులో కనిపించిన ప్రభాస్ లుక్. ఒక వార్ ఫైట్ లో గాయాలతో కూర్చుని ఉన్న ఆ రూపం చాలా క్రేజీగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫస్ట్ లుక్‌తో వచ్చిన ఈ రికార్డు సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచింది. ప్రభాస్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ వార్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికే ‘ఫౌజీ’ సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే, ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!