తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం….బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసం… మా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తై., నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశం తేల్చుకోవాలి. వరద జలాలపై ఇరు రాష్ర్టాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయ బద్ధంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది… రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం… ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదులు వంటి గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటాలు తేల్చి మిగిలిన వాటిని సమృద్ధి గా వాడుకోవచ్చు.
Also Read:Harish Rao: కాళేశ్వరంపై ఇంకో కుట్ర.. మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు
మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయి.. సముద్రంలోకి వెళ్ళే జలాల అని మాట్లాడటం అర్ధం చేసుకోలేని అమాయకులు ఎవరు లేరు.. తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది…అసంతృప్తి అనేది కొందరు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు, రేవంత్, రాహుల్ హాట్ లైన్ పై జగన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైన రాజకీయ ఆరోపణ… రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పార్టీ విధానాలు విశాలమైన ప్రయోజనాలతో ఉంటాయి తప్ప సంకుచితమైన మనస్తత్వంతో ఉండవు.. అని తెలిపారు.