Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Protest: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రత్యేక రైళ్లు కావాలని తెలంగాణ కాంగ్రెస్ కోరింది. అందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిరాకరించింది. దీంతో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే నిలయం వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నేతల నినాదాలతో రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తుతోంది. ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టినా తాము లక్షలాదిగా ఢిల్లీకి చేరుకునేది ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీ వేదికగా నిర్వహించబోయే ‘ఇండియా’ (INDIA) కూటమి ర్యాలీకి దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శనివారం హర్యానా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంజయ్ దత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రావు నరేంద్ర సింగ్ ఇటీవల పీటీఐ (PTI) వార్తా సంస్థకు వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితా పారదర్శకత, ప్రతీ పౌరుడికి ఉండే ఓటు హక్కు పరిరక్షణ అత్యంత కీలకమని, ఈ విషయాల్లో కాంగ్రెస్ ఎలాంటి రాజీ పడబోదని తేల్చిచెప్పారు. ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో జరుగుతున్నాయంటున్న అక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ ప్రచారం ఇప్పుడు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో జరగనున్న ఈ ర్యాలీ దీనికి ముగింపు కానుందని పేర్కొన్నారు. ‘ఓట్ల చోరీ’కి వ్యతిరేకంగా సాగే ఈ మహా ప్రదర్శన ద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తామంతా ఏకతాటిపై ఉన్నామనే బలమైన సందేశాన్ని ఇస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
Also Read
- Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
- UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
- Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
- Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
తాజావార్తలు
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
ట్రెండింగ్
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!