Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలతో చర్చించేందుకు ఆయన ప్రధానంగా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఆరు కేబినెట్ పదవులు ఖాళీగా ఉండడంతో ఆ విషయంపై సమీక్ష కోసం వెళ్లనున్నారు. ఇంకా రాష్ట్రంలోని చాలా జిల్లాలకు మంత్రులు లేరు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తయినట్లు తెలిసింది.
Read also: AP Heavy Rains: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
అయితే, మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరోసారి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ అవసరమని రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్‌కు సూచించనున్నారు. ఇప్పటికే జాబితా ఖరారైనప్పటికీ.. దానికి అనుమతులు వచ్చేలా టూర్ కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రేవంతరెడ్డి సచివాలయంలో నేటి నుంచి ప్రతి శాఖకు సంబంధించి సమీక్షలు చేపడుతున్నారు.
Read also: IND vs NZ: నేడే భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!