NTV Telugu Site icon

Telangana Cabinet : ఈ నెల 23న కేబినెట్ సమావేశం!.. కీలక అంశాలపై చర్చ..

Telangana Cabinet

Telangana Cabinet

ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్సుకు చట్ట బద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా పై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. ఆయా శాఖల నుంచి వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. నెలాఖరున అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు సర్కార్ చేస్తుంది.

READ MORE: KTR: తెలంగాణ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం.. కేటీఆర్‌ కీలక నిర్ణయం

కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రాపై చర్చ జోరుగా కొనసాగుతోంది. హైడ్రా కార్యకలాపాలపై రాజకీయ ప్రకంపనల మధ్య తాజాగా హైడ్రాకు మరిన్ని బాధ్యతలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్‌ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవసరమైన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఈ మేరకు బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. తాజా ఉత్తర్వులతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రక్షించనుంది. జీహెచ్‌ఎంసీ చట్టం -1955 కింద అవసరమైన అధికారాలను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు’ ఉత్తర్వుల్లో వివరించారు.