Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష చేయడం ప్రధాన అజెండాగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అనేక మంత్రివర్గ భేటీలు జరగగా.. అందులో తీసుకున్న నిర్ణయాలు ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అన్న అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై కూడా క్లారిటీ వచ్చే సూచనలు ఉన్నాయి.
Read Also:KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే ఈ భేటీలో అమలుకాని, ఆలస్యమైన నిర్ణయాలకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే దిశగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను రూపొందించనున్నారు. మంత్రుల దగ్గరి నుంచి అధికారుల వరకూ ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, ఆ వివరాలపై పూర్తి సమీక్ష జరగనుంది. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, ఉద్యోగాల భర్తీ, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, గోశాలల నిర్మాణం, మహిళల సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గత క్యాబినెట్ భేటీలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశాన్ని “స్టేటస్ రిపోర్ట్ మీటింగ్”గా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో.. ఈ రోజు సమావేశంలో ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ను సమర్పించి చర్చించే అవకాశం కనపడుతోంది.
Read Also:Samsung Galaxy S24 5G: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ప్రీమియం ఫోన్ పై ఏకంగా రూ.37,000కి పైగా తగ్గింపు!
వీటితోపాటు మేడిగడ్డ బ్యారేజ్‌పై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై కూడా మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా పంచాయతీ రాజ్ చట్టం సవరణ బిల్లును ఆమోదించగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం రూపొందించారు. అయితే ఇది 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటుతుండటంతో రాజ్యాంగ సవరణ అవసరం ఏర్పడింది. అందుకోసం రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి బిల్లును పంపించారు.