Samsung Galaxy S24 5G: ప్రస్తుతం ఒక ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అత్యుత్తమ ఎంపిక కానుంది. దీని కారణం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఈ ఫోన్ పై భారీగా తగ్గింపులు అందుబాటులోకి రావడమే. ముఖ్యంగా ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ఫోన్‌ను మార్కెట్ ధర కంటే సుమారు రూ.37,099 తక్కువ ధరకు పొందొచ్చు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.79,999గా ఉండగా.. ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.42,900కే లభిస్తోంది. శాంసంగ్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.49,999కి లభించనుంది.
Read Also:Bhumana Karunakar Reddy: జగన్ అంటే జనం.. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది!
బ్యాంక్ ఆఫర్ల పరంగా చూస్తే.. HDFC, వన్ కార్డు, ఫెడరల్ వంటి కార్డులపై అదనంగా రూ.1,500 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. అంతేకాకుండా నెలకు రూ.2,080 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ధరను మరింతగా తగ్గించుకునే అవకాశం ఉంది. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, కన్డిషన్ ఆధారంగా రూ. 40,250 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా ఫోన్ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది.

ఇక శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. గెలాక్సీ S24 5G 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే విజన్ బూస్టర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వంటి అధునాతన ప్రొటెక్షన్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఫోర్ గెలాక్సీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది అత్యంత శక్తివంతమైన చిప్ సెట్. ఇక మెమొరీ విషయానికి వస్తే.. 8GB RAM తో పాటు 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
కెమెరా సెటప్ చాలా బాగా ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో (3x జూమ్) రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇక మొబైల్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారిత One UI 6.1 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ ఈ ఫోన్‌కు ఏకంగా 7 సంవత్సరాల వరకూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ హామీ ఇస్తోంది. అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, ఇన్ -డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, లైవ్ త్రన్స్లాటే, జెనెరేటివ్ ఎడిట్ వంటి Gen-AI ఫీచర్లతో ఇది మరింత ఆధునికంగా పనిచేస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ ఇప్పుడు మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు లభించడమే కాకుండా, టాప్ క్లాస్ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ కోసం చూస్తున్నవారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.