Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష చేయడం ప్రధాన అజెండాగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అనేక మంత్రివర్గ భేటీలు జరగగా.. అందులో తీసుకున్న నిర్ణయాలు ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అన్న అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై కూడా క్లారిటీ వచ్చే…