Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nampally Railway Station Demolition: హైదరాబాద్ నగర చరిత్రలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. నిజాం కాలం నాటి చారిత్రక కట్టడాల్లో ఒకటైన నాంపల్లి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే (SCR) పాక్షికంగా కూల్చివేసింది. రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా ఈ చర్య చేపట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కూల్చివేసి పునరాభివృద్ధి పనులు చేపట్టిన రైల్వే శాఖ.. ఇప్పుడు నాంపల్లి స్టేషన్‌పైనా దృష్టి పెట్టింది.
నాంపల్లి రైల్వే స్టేషన్‌ను హైదరాబాద్-దక్కన్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. నగరంలోని అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేషన్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కూల్చివేతపై గతంలోనే పలువురు పౌరులు, వారసత్వ కట్టడాల పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
- Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
- 9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
- Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
ఈ విషయంపై రైల్వే అధికారులను సంప్రదించగా.. నాంపల్లి స్టేషన్ వారసత్వ కట్టడాల పరిరక్షణ జాబితాలో లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకే పునరాభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేత చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ మాత్రం రక్షిత స్మారక కట్టడాల జాబితాలో ఉండటంతో దాని పునరాభివృద్ధి చేపట్టడం లేదని పేర్కొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1907లో హైదరాబాద్ ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా పాలనలో దీనిని నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ నగరాన్ని ముంబైతో అనుసంధానించే ముఖ్యమైన రైల్వే కేంద్రంగా ఇది పనిచేసింది. ప్రయాణికుల కోసం నాంపల్లి సరాయ్ పేరుతో విశ్రాంతి భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో నిర్మించిన ఈ స్టేషన్ నగర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
హైదరాబాద్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి క్రమంగా జరిగింది. నగరంలో తొలి రైల్వే మార్గంగా వాడి-సికింద్రాబాద్ లైన్ ఏర్పాటైంది. 1869లో ఈ మార్గానికి సర్వే నిర్వహించగా, 1871లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆపై 1874 అక్టోబర్ 9న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ ఈ మార్గాన్ని నిర్వహించింది. అప్పట్లో రైల్వే మార్గాల నిర్మాణం కేవలం ప్రజా రవాణా కోసమే కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టారు. హైదరాబాద్‌లో బ్రిటిష్ సైనిక బలగాలు ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు రవాణా సౌకర్యాలు కల్పించడం కూడా ముఖ్య ఉద్దేశంగా ఉండేది. మరోవైపు నిజాం పాలకులు తమ రాజ్యంలో ఆర్థికాభివృద్ధి, ప్రజల రవాణా అవసరాల కోసం రైల్వే వ్యవస్థను విస్తరించాలనుకున్నారు.
ఈ నేపథ్యంలో పలు చర్చలు, ఒప్పందాల అనంతరం 1883లో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్ (Nizam’s Guaranteed State Railways) ఏర్పాటైంది. ఆ తర్వాత కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్లు నిర్మించడంతో హైదరాబాద్ రైల్వే నెట్వర్క్ విస్తరించింది. అలా నగర చరిత్రలో భాగమైన నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ కూల్చివేతతో నిజాం కాలం నాటి మరో చారిత్రక నిర్మాణం రూపురేఖలు మారిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
-
CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!