అభ్యర్థుల ఎంపిక కమలం పార్టీ దృష్టి పెట్టింది… ఇప్పటికే పలు మార్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు… నెక్స్ట్ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థుల ఎంపిక పై చర్చ జరగనుంది… 15 న లేదా ఆ తరవాత అభ్యర్థులను కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు క్యాండెట్లను ప్రకటించాల్సి ఉంది. కమలం పార్టీ కమలం పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది.
Also Read : AP CM Jagan: ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి..
బీజేపీ ఢిల్లీ టీమ్ లు తెలంగాణ లో గత కొన్ని నెలలుగా సర్వే లు చేస్తున్నాయి… వివిధ వర్గాల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి…. వాటి ఆధారంగా అభ్యర్థుల పై పార్టీ కేంద్ర నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం… రాష్ట్ర నేతలు కూడా తమ అభిప్రాయాలు చెప్పారు… ఇప్పటికే పలు నియోజక వర్గాల పై ఏకాభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నారు… 50 శాతం నియోజక వర్గాలకి అభ్యర్థులను ఫైనల్ చేశామని … కేంద్ర ఎన్నికల కమిటీ ఎప్పుడు సమావేశం అయితే అప్పుడు వెళ్లి జాబితా ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు… వివిధ వర్గాల నుండి అభిప్రాయం తీసుకున్నామని చెప్పారు…
Also Read : Nara Lokesh: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ విచారణ..
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థులను బీజేపీ పలు స్థానాలకు ప్రకటించింది… కేంద్ర మంత్రులను, ఎంపి లని బరిలోకి దింపింది…తెలంగాణ సంబందించి ఇప్పటి వరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ టచ్ చేయలేదు… నెక్స్ట్ జరగబోయే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థుల పై చర్చ జరగనుంది… ఈ నెల 15 న మీటింగ్ ఉండే అవకాశం ఉంది.. 15 తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు… మొదటి జాబితాను ప్రకటించనున్నారు…