Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!
- గోదావరి ఘాట్లలో అధ్వాన పరిస్థితి
- భక్తులకు ఇబ్బందులు.. దుర్వాసనతో ఇబ్బంది
- అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
- పుష్కరాల ముందు చర్యలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Bathing Ghats : పవిత్ర గోదావరి నది తీరంలోని స్నాన ఘాట్లు ప్రస్తుతం అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే ఈ ఘాట్లు ఇప్పుడు అపరిశుభ్రతకు, దుర్వాసనకు నిలయంగా మారాయి. రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలోని స్నాన ఘాట్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పవిత్ర గోదావరి స్నానాల కోసం భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఘాట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది.
IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
భక్తులు కనీసం అక్కడ నిలబడలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం , సాయంత్రం వేళల్లో ఈ దుర్వాసన మరింత ఎక్కువగా వ్యాపిస్తూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. వేసవి కాలం కావడంతో సాయంత్రం వేళ చల్లని గాలి కోసం గోదావరి తీరానికి వచ్చే ప్రజలు అక్కడి అపరిశుభ్రతను చూసి విస్తుపోతున్నారు. శుభ్రత పనుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై చివరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవానికి ముందే ఘాట్లను సిద్ధం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత పవిత్రమైన గోదావరి తీరంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భక్తుల భద్రత , సౌకర్యాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుష్కరాల నాటికైనా ఘాట్లను బాగు చేయాలని, మురుగునీటి సమస్యను పరిష్కరించి భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధికి, పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?