BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో నేడు (బుధవారం) కీలక విచారణ సాగింది. బీసీల్లో వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, విచారణ వాడివేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున లాయర్ సుదర్శన్ వాదనలు వినిపించారు. అయితే, నిరంతరం అదే అంశాలను పునరావృతం చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. ఇది చివరి విచారణ కాదు. అన్ని అంశాలను ఒకేసారి ప్రస్తావించవద్దు. మా ఓపికను పరీక్షించకండని కోర్టు స్పష్టం చేసింది.
Red Alert: రెడ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
తర్వాత ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచే హక్కు కలిగి ఉందని తెలిపారు. అంతేకాకుండా.. “ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతం వరకు పెంచబడ్డాయి. ఈ ప్రక్రియలో 97 శాతం ఇంటింటి సర్వే జరిగింది. బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. వారు దాన్ని ఆమోదించలేదు, తిరస్కరించలేదూ అని వివరించారు.
Illicit affair: అత్తతో అక్రమ సంబంధం.. భార్య హత్య..
అలాగే, ఆయన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, “2019లో దేశవ్యాప్తంగా EWS వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటి 60 శాతానికి చేరాయని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్య మాత్రమే, కానీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఎక్కడా లేదని వాదించారు. అయితే హైకోర్టు ప్రభుత్వం తరఫున పలు ప్రశ్నలు సంధించింది. ఇందులో గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుండి పెండింగ్లో ఉంది? ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అమలు చేశారా? బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా నిర్వహించారు? కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ చేశారా? ప్రజల అభ్యంతరాలు స్వీకరించారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సమాధానాలను కోరిన హైకోర్టు విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామన్నారు ఏజీ. రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను హైకోర్టు పట్టించుకోలేదు.